|
| కరుణానిధికి జయలలిత లీగల్ నోటీసులు |
| చెన్నై (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 15:04 IST ) | |
చెన్నై లా కళాశాల వివాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధికి బుధవారం ప్రతిపక్ష అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత లీగల్ నోటీసులు జారీ చేశారు. చెన్నై లా కళాశాలలో ఇటీవల జరిగిన ఘర్షణలను ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రోత్సహించిందని కరుణానిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జయలలిత ఈ నోటీసులు పంపారు.
చెన్నై లా కళాశాలలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య ఇటీవల ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ వివాదం కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే తమ పార్టీ విద్యార్థి ఘర్షణలను ప్రోత్సహించిందని చేసిన ఆరోపణలపై కరుణానిధి 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని జయ హెచ్చరించారు. అంతేకాకుండా రూ.1 కోటి పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.
కరుణానిధి దురుద్దేశాలతో ఈ ప్రకటన చేశారని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే డీఎంకే చీఫ్ కరుణానిధి మంగళవారం ప్రతిపక్ష ఒత్తిడి బాగా పెరగడంతో ఈ వివాదంపై మరోసారి స్పందించారు. లా కళాశాల వివాదంపై హాస్యాస్పదంగా పైవ్యాఖ్యలు చేశానన్నారు. తన మాటల వెనుక ఎవరి ప్రతిష్టకు భంగం కలిగించాలనే ఉద్దేశం లేదని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|