|
| కాంగ్రెస్ దేశాన్ని పౌరయుద్ధంవైపు నెడుతోంది: బీజేపీ |
| లక్నో (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008 ( 11:39 IST ) | |
హిందూ తీవ్రవాదం నెపంతో ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఇటువంటి చర్యలేవైనా దేశాన్ని పౌర యుద్ధంవైపు నెడతాయని హెచ్చరించారు. లక్నోలో జరిగిన వ్యాపారుల ర్యాలీ రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తీవ్రవాదంపై పోరు విషయంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ముస్లిం తీవ్రవాదం, హిందూ తీవ్రవాదం అనే పదాలను ఉపయోగించుకుంటుందన్నారు. ఇటువంటి చర్యలు దేశంలో అల్లకల్లోలాలు సృష్టిస్తాయన్నారు. ఈ మార్గాన్ని కాంగ్రెస్ విడిచిపెట్టాలని కోరారు. తీవ్రవాదాన్ని మత ప్రాతిపదికన చూడకూడదని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|