|
| యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 15:39 IST ) | |
అసహ్యకరంగా మారిన భారత రాజకీయాల రూపురేఖలు మార్చాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ భారత రాజకీయాల రూపురేఖలను యువత మార్చగలదన్నారు. రాజకీయాలవైపు వచ్చేలా యువతను ప్రోత్సహించడం ద్వారా ఇది సాధ్యపడుతుందని చెప్పారు.
భారత రాజకీయాల అసహ్యకరమైన రూపాన్ని చెరిపేయాల్సిన బాధ్యత మనపై ఉందని తన తోటి రాజకీయ నాయకులకు అద్వానీ పిలుపునిచ్చారు. ప్రతిభాపాటవాలు కలిగిన యువకులు రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయతా విలువల సంక్షోభం- దాని పరిష్కారం అనే అంశంపై జాతీయతా విలువల పునరుద్ధరణ సంస్థ (ఎఫ్ఆర్ఎన్‌వీ) ఏర్పాటు చేసిన సదస్సులో అద్వానీ పాల్గొన్నారు.
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి వార్షిక నివేదికల్లో భారత్ స్థానాలను అద్వానీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ నివేదికల ప్రకారం అవినీతిలో దేశం మొదటి స్థానంలోనూ, మానవ అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందని తెలిపారు.
రాజకీయాల్లో అంకితభావం లేకపోవడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రాజకీయాలు గొప్ప వృత్తిగా ఉండేవి. అయితే స్వాతంత్ర్యం తరువాత ఈ స్ఫూర్తి క్రమక్రమంగా కలుషితం అయిందన్నారు. దురదృష్టవశాత్తూ ప్రస్తుత దేశ రాజకీయాలు వ్యాపారంగా మారాయని అద్వానీ విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|