|
| రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 14:39 IST ) | |
బీజేపీ మాజీ నేత గోవిందాచార్య తిరిగి రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాదిగా పేరొందిన ఆయన మంగళవారం తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.
జాతీయతావాదులు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇది సరైన సమయమని గోవిందాచార్య ఈ సందర్భంగా చెప్పారు. భారత రాజకీయాల్లోని రెండు ప్రధాన పార్టీలు ధనిక, మైనారిటీ, విదేశీ పక్షపాతులుగా మారాయని విమర్శించారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున కొత్త పార్టీని నెలకొల్పుతాన్నారు.
గతంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ హయంలో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి బీజేపీ ముసుగు మాత్రమేననిని, అద్వానీ పార్టీ వాస్తవ రూపమని చేసిన సంచలన ప్రకటన చేసి గోవిందాచార్య బీజేపీకి దూరమయ్యారు. పార్టీకి దూరమైన అనంతరం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు.
మరో బీజేపీ తిరుగుబాటు నేత ఉమా భారతి నెలకొల్పిన భారతీయ జనశక్తి పార్టీ (బీజేఎస్)లో చేరతారా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ బీజేఎస్‌లో చేరడం ఒక ప్రత్యామ్నాయం మాత్రమేనని, అయితే తాము జాతీయ రాజకీయాలను పటిష్టపరిచేందుకు కొత్త పార్టీని ఏర్పాటు చేయడంపై దృష్టిపెట్టానని చెప్పారు
ప్రస్తుతం భారతీయ సమాజం తీవ్రవాదం, సామాజిక సామరస్యం, పేదరికం అనే మూడు సవాళ్లను ఎదుర్కొంటుందని, దేశ రాజకీయాల్లో కొంత ఖాళీ ఏర్పడిందని గోవిందాచార్య పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి తిరిగి అడుగుపెట్టాలని నిర్ణయించుకోవడానికి ఇదే ప్రధాన కారణమన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|