|
| పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి |
| ముజాఫర్‌నగర్ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 13:24 IST ) | |
ఉత్తరప్రదేశ్‌లోని పానిపట్ రహదారిపై పెళ్లి బృందంతో వస్తున్న బస్సు, ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఏడుగురు బాలలతో సహా మొత్తం 16 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడ్డారు. పానిపట్ నుంచి సిసోలి పట్టణానికి తిరిగి వస్తున్న పెళ్లి బృందం బస్సు సోమవారం రాత్రి ప్రమాదానికి గురైందని పోలీసులు ఈ రోజు వెల్లడించారు.
సరుకులతో వస్తున్న ట్రక్కును ఈ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో వేర్పేరు ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. గాయపడినవారిలో పలువురి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|