|
| ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీ |
| ముంబయి (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008 ( 11:29 IST ) | |
మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) జరుపుతున్న దర్యాప్తుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. మాలేగావ్ పేలుడు కేసుపై దర్యాప్తు జరుపుతున్న ఏటీఎస్‌కు మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మార్గనిర్దేశనం చేస్తోందని విమర్శించింది.
మాలేగావ్ పేలుళ్ల కేసులో కొంతమంది హిందు మత నేతలు, ఆర్మీ అధికారి ఒకరు అనుమానితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి ప్రకాశ్ జావేద్‌కర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఏటీఎస్ దర్యాప్తును రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తోందని వ్యాఖ్యానించారు.
మాలేగావ్ పేలుడు కేసులో ఏటీఎస్ తన పని తాను చేస్తుందని ఈ బీజేపీ ఎంపీ పేర్కొన్నారు. ప్రజలకు నమ్మకమైన రీతిలో ఏటీఎస్ ఈ కేసు దర్యాప్తు కొనసాగించాలని కోరారు. మాలేగావ్ పేలుడు కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|