|
| సాధ్వి ప్రజ్ఞా సింగ్ కస్టడీ 29 వరకు పొడిగింపు |
| నాసిక్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:36 IST ) | |
మాలేగావ్ పేలుడు కేసు నిందితులకు కోర్టు మరో 12 రోజుల జ్యుడిషియల్ రిమాండ్‌ను ఆదేశించింది. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తోపాటు ఆరుగురు నిందితుల జ్యూడిషయల్ కస్టడీ సోమవారంతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసిక్ సెషన్స్ కోర్టు సోమవారం వీరిని ఈ నెల 29 వరకు జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సాధ్వి ప్రజ్ఞా సింగ్‌ను పోలీసులు సోమవారం నాసిక్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆమె రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశించింది. ఇదిలా ఉంటే సాధ్వి తరపు న్యాయవాది కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళ అధికారులు విచారణ సందర్భంగా సాధ్విని హింసిస్తున్నారని ఈ అఫిడవిట్‌లో ఆరోపించారు.
సాధ్వి సోమవారం విచారణ సందర్భంగా తనపై ఎటువంటి ఆరోపణలు మోపారో తెలియదని కోర్టుకు విన్నవించారు. కేసు విచారణను హిందీలో జరపాలని కోరారు. మరోవైపు మాలేగావ్ పేలుడు కేసులో అరెస్టయిన తొమ్మది మంది నిందితులను విచారించేందుకు అవకాశం కల్పించాలని గుజరాత్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను నాసిక్ కోర్టు తోసిపుచ్చింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|