|
| మాలేగావ్ పేలుడు: ఆర్మీ అధికారిపై మరో కేసు |
| నాసిక్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 10:30 IST ) | |
మాలేగావ్ పేలుడులో తన ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్మీ అధికారి ప్రసాద్ పురోహిత్‌పై మరో కేసు నమోదు అయిందని పోలీసులు ఆదివారం వెల్లడించారు. పూణేకు చెందిన ఒక వ్యక్తికి నకిలీ పత్రాలను ఉపయోగించి ఆయుధ లైసెన్స్‌ను ఇప్పించినందుకు పురోహిత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శిరీష్ యశ్వంత్ దాతే అనే వ్యక్తి సర్కార్‌వాడా పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి తన బంధువుల ద్వారా రివాల్వర్ పొందేందుకు 2005లో పురోహిత్‌కు రూ.20 వేల చెల్లించాడు. లైసెన్స్ పొందేందుకు పురోహిత్ దెవ్లాలీ ఆర్మీ క్యాంపులో నివాసం ఉంటున్నట్టు నకిలీ ధృవపత్రాలను సమర్పించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
మాలేగావ్ పేలుడు కేసులో పురోహిత్ అరెస్టు కావడంతో యశ్వంత్ దాతే నాసిక్ నుంచి తాను పొందిన లైసెన్స్ విశ్వసనీయతను పరిశీలించుకున్నారు. నకిలీ ధృవపత్రాలతో తాను ఈ లెసెన్స్ పొందినట్లు తేలడంతో, దాతే స్వచ్ఛందంగా పురోహిత్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పురోహిత్ నకిలీ ధృవపత్రాలు పొందేందుకు సహకరించిన వారిని కూడా తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|