|
| కాశ్మీర్‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 09:17 IST ) | |
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాల్లో తొలి విడత ఎన్నికలు జరుగుతాయి. ఎన్నో ఏళ్లుగా కాశ్మీర్‌లో ఉద్రిక్తతలకు కారణం అవుతోన్న వేర్పాటువాదానికి, అమర్‌నాథ్ ఆలయ ట్రస్టు భూవివాదంతో చెలరేగిన ప్రాంతీయ విద్వేషాలు తోడవడంతో రాష్ట్రంలో ఈ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సాముగా మారింది.
దీనికి అననుకూల వాతావరణ పరిస్థితులు తోడయ్యాయి. గత కొన్నిరోజులుగా అకాల మంచువర్షం రాష్ట్రాన్ని ముంచెత్తుతోంది. వేర్పాటువాద శక్తులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. అవాంఛనీయ సంఘటనలను అడ్డుకునేందుకు భారీ ఎత్తున కేంద్ర సాయుధ బలగాలను మోహరించింది.
సోమవారం బాందీపురా, పూంచ్, లేహ్, కార్గిల్ జిల్లాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాల్లో 1038 పోలింగ్ కేంద్రాలను వేర్పాటు చేశారు. వీటిలో సగం పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. మిగిలినవాటిని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలోని మిగిలిన 77 నియోజవర్గాల్లో ఆరు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్‌ను నవంబరు 23, 30, డిసెంబరు 7, 13, 17, 24 తేదీల్లో నిర్వహించనున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|