యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
లక్నోలో బాంబు పేలుడు: ఇద్దరికి గాయాలు
లక్నో (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008   ( 16:41 IST )
ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో ఆదివారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. ఈ బాంబు పేలుడులో ఇద్దరు బాలికలు గాయపడ్డారు. నగరంలోని ఖాలా బజార్ ప్రాంతంలో క్రూడ్ బాంబు పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. ఐష్‌బాగ్ అనే ప్రదేశంలో ఉన్న చెత్తకుప్పలో ఈ బాంబు పేలింది. గత మూడు రోజుల్లో లక్నోలో జరిగిన మూడో క్రూడ్ బాంబు పేలుడు ఇది.

ఇద్దరు బాలికలు ఆదివారం ఉదయం 9.40 గంటల సమయంలో ఈ ప్రాంతంలో చెత్తలో పనికొచ్చే వస్తువులు ఏరుకుంటుండగా బాంబు పేలింది. స్వల్వ తీవ్రత కలిగిన పేలుడు కావడంతో ఇద్దరు బాలికలు గాయలతో బయటపడ్డారు. ఈ చెత్తకుప్పలో పోలీసులు మరో మూడు పేలని బాంబులను స్వాధీనం చేసుకొని నిర్వీర్యపరిచారు. దీని వెనుక తీవ్రవాద చర్య ఉన్నట్లు తాము భావించడం లేదని ఎస్పీ అఖిల్ కుమార్ తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పదును తగ్గిన తీవ్రవాద నిరోధక చట్టాలు
ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: మన్మోహన్
ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు
సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్
తాజాగా భయ్యా కేక్ వివాదంలో రాజ్ థాకరే
చత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...