|
| పదును తగ్గిన తీవ్రవాద నిరోధక చట్టాలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008 ( 16:34 IST ) | |
ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఎంతోకాలంగా దేశంలో తీవ్రవాద నిరోధక చట్టాలకు పదును తగ్గిందని వినిపిస్తున్న వాదనకు తాజాగా వెల్లడైన ఒక నివేదికతో మరింత బలం చేకూరింది. ప్రస్తుతం అమల్లో ఉన్న తీవ్రవాద నిరోధక చట్టాలు ప్రభావవంతంగా లేవని అధికారిక నివేదిక ఒకటి వెల్లడించింది.
ఇతర దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలతో పోలిస్తే మన దేశంలో అమల్లో ఉన్న చట్టాలకు పదును తగ్గిందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండో పరిపాలన సంస్కరణల సంఘం ఈ నివేదికను తయారు చేయడం గమనార్హం. అనేక దేశాలు తీవ్రవాదం విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ, అదే విధమైన చట్టాలను తీసుకొచ్చాయని ఈ సంఘం తన నివేదికలో పేర్కొంది.
భారత్‌లో ఉన్న చట్టాలు మాత్రం కాలం తీరిపోయి, పదును తగ్గి ఉన్నాయంది. ప్రతిపక్ష బీజేపీ కూడా చాలాకాలం నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం తీవ్రవాదం విషయంలో మెతక వైఖరిని అనుసరిస్తుందని విమర్శలు గుప్పిస్తోంది. తాము అధికారంలోకి వస్తే పోటా వంటి కఠిన చట్టాలను తీసుకొస్తామని ప్రకటించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|