యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: మన్మోహన్
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 16 నవంబర్ 2008   ( 16:14 IST )
దేశంలో ముందస్తు సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం లేదని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం నానాటికీ తీవ్రమవుతుండటం, భారత్‌పై దీని ప్రభావం ఎక్కువవుతుందనే భయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ముందస్తు లోక్‌సభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ... ఎన్నికలకు ఆర్థిక సంక్షోభంతో ఎటువంటి సంబంధం లేదన్నారు.

ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్పారు. వాషింగ్టన్‌‍లో జరిగిన జి- 20 సమావేశంలో పాల్గొని భారత్ తిరిగివస్తూ ప్రధాని ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంపై సరైన చర్యలు తీసుకుందని చెప్పారు. సంక్షోభాన్ని నివారించడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించిందని, ప్రజలు తమపై నమ్మకాన్ని ఎన్నికల ద్వారా ప్రతిఫలింపజేస్తారని ప్రధాని పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు
సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్
తాజాగా భయ్యా కేక్ వివాదంలో రాజ్ థాకరే
చత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్
చంద్రుడిపై త్రివర్ణ పతాకం: ఇస్రో ఘన విజయం
చత్తీస్‌గఢ్: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...