యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సాధ్వి అరెస్ట్ ఎన్నికల ఎత్తుగడ: సుష్మా స్వరాజ్
ఇండోర్ (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 15:11 IST )
మాలేగావ్ పేలుడు కేసులో సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల జిమ్మిక్కుగా వర్ణించింది. సెప్టెంబరు 29నాటి మాలేగావ్ పేలుడు కేసులో సాధ్విని మహారాష్ట్ర తీవ్రవాద నిరోధక దళం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

త్వరలో జరగబోతున్న ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని సాధ్విని అరెస్టు చేశారని పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ఈ వ్యవహారం ముగుస్తుందని మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు.

భద్రతా సంస్థలు మాలేగావ్ పేలుడు కేసులో.. లష్కరే తోయిబా తీవ్రవాదుల కన్నా సాధ్వి ప్రమాదకరమైన వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో కాషాయం, భద్రతా దళాలపై ప్రజలకు అపార విశ్వాసం ఉందని చెప్పారు. భద్రతా సంస్థలు పేలుళ్ల వంటి సున్నితమైన అంశాల జోలికి వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని కోరారు. లేకపోతే ఇటువంటి అంశాలు అశాంతికి దారితీస్తాయని హెచ్చరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తాజాగా భయ్యా కేక్ వివాదంలో రాజ్ థాకరే
చత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్
చంద్రుడిపై త్రివర్ణ పతాకం: ఇస్రో ఘన విజయం
చత్తీస్‌గఢ్: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
చెన్నై లా కళాశాల వివాదం: బస్సులు ధ్వంసం
మాజీ కేంద్ర మంత్రి అజిత్ పాంజా కన్నుమూత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...