యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
తాజాగా భయ్యా కేక్ వివాదంలో రాజ్ థాకరే
ముంబయి (ఏజెన్సీ), శనివారం, 15 నవంబర్ 2008   ( 10:15 IST )
మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే పుట్టినరోజు కేక్‌తో కొత్త వివాదానికి కారణమయ్యారు. మహారాష్ట్రేతర వివాదాన్ని "భయ్యా కేక్"తో రాజ్ థాకరే కొత్త మలుపుతిప్పారు. ముంబయిలో జూన్- 14న తన పుట్టినరోజు సందర్భంగా "భయ్యా" అని హిందీలో రాసి ఉన్న కేక్‌ను రాజ్ థాకరే కట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ శుక్రవారం బయటకు వచ్చింది.

"భయ్యా" పదానికి పెద్ద సోదరుడు అనే అర్థం వస్తుంది. ముంబయిలో ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రజలు ఈ పదాన్ని సాధారణంగా ఉపయోగిస్తుంటారు. భయ్యా కేక్ వివాదానికి సంబంధించిన వీడియో క్లిప్ శుక్రవారం మధ్యాహ్నం టీవీ ఛానళ్లకు దొరికింది. అనంతరం కాసేపటికే ఈ వీడియో క్లిప్‌పై దుమారం చెలరేగడంతో ఎంఎన్ఎస్ ప్రతినిధులు దీనిపై వివరణ ఇచ్చేందుకు తంటాలు పడ్డారు.

పార్టీ ఉపాధ్యక్షుడు వాగేష్ సరస్వత్ మాట్లాడుతూ.. తమ పార్టీలోనూ అనేక మంది ఉత్తర భారతీయులు ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఈ వీడియోను తీసి ఉంటారు. అయితే దీనిని తీసిందెవరో చెప్పలేమన్నారు. ఈ కేక్ బహూకరించిన వ్యక్తి రాజ్ థాకరేను పెద్ద సోదరుడిగా భావించి ఉంటాడని, ఇది ఉత్తర భారతీయులకు వ్యతిరేకంగా జరిగింది కాదని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
చత్తీస్‌గఢ్ తొలి దశ ఎన్నికల్లో 53 శాతం పోలింగ్
చంద్రుడిపై త్రివర్ణ పతాకం: ఇస్రో ఘన విజయం
చత్తీస్‌గఢ్: తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో హింస
చెన్నై లా కళాశాల వివాదం: బస్సులు ధ్వంసం
మాజీ కేంద్ర మంత్రి అజిత్ పాంజా కన్నుమూత
నేడు చత్తీస్‌గఢ్‌లో తొలి దశ ఎన్నికల సమరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ...
28న దేవరకొండ వీరయ్య విడుదల
గోపీచంద్ 'శౌర్యం'కు అర్ధ శతదినోత్సవం
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...