|
| శ్రీనగర్ ఘర్షణల్లో పది మందికి గాయాలు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 16:28 IST ) | |
శ్రీనగర్‌లో ఆదివారం భద్రతా దళాలకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పది మంది గాయపడ్డారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారిక యంత్రాంగం కర్ఫ్యూ వంటి ఆంక్షలను మళ్లీ విధించారు.
నగరంలోని పాతబస్తీలో ఉన్న నౌహత్తా, గొజివారా, రాజౌరి కాదల్, బోహ్రీ కాదల్, నైద్ కాదల్, ఫతే కాదల్, ఖాన్‌కాహి మౌల్లా, కౌ మొహల్లా, రెయిన్వారి ఆదివారం భారత్ వ్యతిరేక నినాదాలు చేస్తూ కొందరు యువకులు రోడ్లపైకొచ్చారు. అనంతరం పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిపైకి రాళ్లు రువ్వారు.
దీంతో భద్రతా దళాలు నిరసనకారులపైకి భాష్ప వాయువు గోళాలను పేల్చాయి. అయినా ఖాన్‌కాహి మౌల్లా ప్రాంతంలో అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తికి బుల్లెట్ గాయమైంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|