|
| భజ్‌రంగ్ దళ్‌పై నిషేధానికి కాంగ్రెస్ డిమాండ్ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 12:17 IST ) | |
భజ్‌రంగ్ దళ్‌పై నిషేధం విధించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడుల్లో భజ్‌రంగ్ దళ్ ప్రమేయం ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
సోమవారం జాతీయ సమగ్ర మండలి (ఎన్ఐసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో భజ్‌రంగ్ దళ్‌పై నిషేధం విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం గమనార్హం. కాంగ్రెస్ మీడియా విభాగ చీఫ్ వీరప్ప మొయిలీ విలేకరులతో మాట్లాడుతూ ఒరిస్సా, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒక మతంవారిని లక్ష్యంగా చేసుకొని జరిగిన హింసాత్మక సంఘటనలు మత తీవ్రవాదానికి నిదర్శమన్నారు.
బాగా ఆలోచించి, దురుద్దేశ్యంతో ఈ దాడులు జరిగాయన్నారు. భజ్‌రంగ్ దళ్‌పై నిషేధం సోమవారం జరిగే ఎన్ఐసీ సమావేశం అజెండాలో ఉందా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఎన్ఐసీ ఈ విషయంపై స్పష్టమైన అవగాహన కలిగివుందన్నారు. ఇందుకు సంబంధించి తగిన చర్య తీసుకుంటుందని మొయిలీ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|