యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాందమాల్ శాంతికై ఒరిస్సా వినతి
భువనేశ్వర్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 16:27 IST )
మత ఘర్షణలతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్న కాందమాల్‌లో శాంతిని చేకూర్చాలంటూ అక్కడి ప్రజలకు ఒరిస్సా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. గత ఆరువారాలుగా మత ఘర్షణలతో అట్టుడికిన ఈ ప్రదేశంలోని ప్రజలు ఇకనైనా తమ పగలు మర్చిపోయి సాధారణ జీవితాన్ని గడపాలంటూ ఒరిస్సా ప్రభుత్వం పేర్కొంది.

ఈ విషయమై శనివారం ఒరిస్సా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేస్తూ గత పదిరోజులుగా కాందమాల్‌లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్టు తెలిపింది. అంతేకాకుండా కాందమాల్ ప్రాంతంలోని అన్ని మత వర్గాలు సంయమనం పాటించాలంటూ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది.

గత ఆగస్ట్ 23న వీహెచ్‌పీకి చెందిన స్వామి లక్ష్మనానందా సరస్వతితో సహా మరో నలుగురు ఆశ్రమవాసులు హత్య చేయబడిన విషయం తెలిసిందే. దీంతో హిందూ వర్గానికి చెందిన కొందరు ఈ హత్యలకు కారణం క్రైస్తవులేనంటూ కొన్ని చోట్ల ఘర్షణలకు దిగారు. దీంతో కాందమాల్ ప్రాంతంలోని ఇరు మతాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరాయి.

ఈ ఘర్షణల్లో దాదాపు 35మంది మరణించగా మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కొద్ది రోజుల తర్వాత లక్ష్మనానంద స్వామి హత్యకు కారణమైన ముగ్గురు మావోయిస్టులను ఒరిస్సా పోలీసులు అరెస్ట్ చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా
కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్
ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు
కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...