యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్
ముంబయి (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 15:14 IST )
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ కడుపునొప్పి కారణంగా శనివారం ముంబాయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తీవ్రమైన కడుపునొప్పి కారణంగా ఆయన ఆస్పత్రికి వచ్చినట్టు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ విషయంపై నోరు విప్పలేదు. అదేసమయంలో శనివారం అమితాబ్ తన 66వ పుట్టినరోజు జరపుకుంటుండడం విశేషం.

కడుపునొప్పి కారణంగా ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో చేరిన అమితాబ్‌ను అక్కడినుంచి ప్రముఖ లీలావతీ అస్పత్రికి తరలించారు. సాధారణ పరీక్షలకోసమే అమితాబ్ ఆస్పత్రికి వచ్చినట్టు మొదట వార్తలు వచ్చినా అనంతరం తీవ్రమైన కడుపునొప్పి కారణంగానే ఆయన ఆస్పత్రిలో చేరినట్టు తెలుస్తోంది.

అమితాబ్‌ను తొలుత పరిశీలించిన నానావతి ఆస్పత్రి వర్గాలు సాధారణ పరీక్షల కోసమే అమితాబ్ ఆస్పత్రిలో చేరారని కనుక అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఆ ఆస్పత్రి నుంచి అమితాబ్‌ను లీలావతి ఆస్పత్రికి తరలించడంతో ఆయన ఆరోగ్య విషయమై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు
కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
ఇరు దేశాల మధ్య సహకారం అవసరం : ప్రధాని
ప్రధాని శ్రీనగర్ రాక: ఉద్రిక్త పరిస్థితులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...