|
| కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా |
| శ్రీనగర్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 11:08 IST ) | |
కాశ్మీర్ లోయలో తొలి రైలుకు ప్రధాని మన్మోహన్ సింగ్ శనివారం పచ్చజెండా ఊపారు. దాదాపు 117 కిలోమీటర్ల పొడవు కల్గిన ఈ రైలు మార్గంలోని నవ్‌గామ్ రైల్వే స్టేషన్‌లో ప్రధాని తొలి రైలును ప్రారంభించారు. దాదాపు పదేళ్ల క్రితం ప్రారంభించబడిన ఈ రైలు మార్గం ఇన్నాళ్లకు అందుబాటులోకి రావడం విశేషం.
దక్షిణాన ఉన్న క్వాజీగండ్‌ను ఉత్తరాన ఉన్న బారాముల్లా పట్టణంతో కలిపేలా ఈ రైలు మార్గం నిర్మించబడింది. ఈ విషయమై రైల్వే అధికారులు మాట్లాడుతూ మొత్తం రైలు మార్గం 117 కిలోమీటర్లు అయినా ఇందులో ప్రస్తుతం 66 కిలోమీటర్ల మార్గం మాత్రమే ఉపయోగానికి సిద్ధమైందని తెలిపారు.
ఈ మార్గంలో ప్రయాణించే రైలు బడ్‌గామ్ జిల్లాలోని రాజ్‌వన్షర్ నుంచి అనన్తన్గ్‌కు ప్రయాణిస్తుందని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించడానికి రైలు ఛార్జీని రూ. 15గా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. అలాగే ఈ మార్గంలో రైలు అక్టోబర్ 12నుంచి నిరవధికంగా అందుబాటులోకి వస్తుందని, ఈ మార్గంలో ప్రయాణించే రైలులో ఎనిమిది కోచ్‌లు ఉంటాయని ఆయన తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|