|
| ప్రధాని శ్రీనగర్ రాక: ఉద్రిక్త పరిస్థితులు |
| శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 17:35 IST ) | |
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం మధ్యాహ్నం కాశ్మీర్ లోయ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లోయలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వేర్పాటువాద గ్రూపులు కాశ్మీర్ లోయలోని పలు పట్టణాల్లో ఆందోళనకు దిగాయి.
కొన్నిచోట్ల భద్రతా దళాలపై వేర్పాటువాదులు రాళ్లు రువ్వారు. ప్రధాని కాశ్మీర్ పర్యటనకు అడుగుపెట్టగానే ఈ ప్రాంతంలో బంద్ వాతావరణం నెలకొంది. శ్రీనగర్‌లో ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం వివిధ పార్టీల నేతలను కలుసుకోనున్నారు.
షేర్ ఎ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాని కాశ్మీర్ పరిస్థితులపై రాజకీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతారు. త్వరలో జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రధాని ఈ చర్చల్లో దృష్టిసారిస్తారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ కాశ్మీర్ పర్యటన జరిపే సమయంలో బంద్ నిర్వహించాలని ఇక్కడి వేర్పాటువాద గ్రూపులు పిలుపునిచ్చాయి. శుక్రవారం మధ్యాహ్నం శ్రీనగర్‌లోనూ, పలు ఇతర పట్టణాల్లోనూ భద్రతా దళాలపై ఆందోళనకారులు రాళ్లురువ్వారు.
ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జమ్ము ప్రాంతంలో చినాబ్ నదిపై నిర్మించిన బాగ్లీహార్ జల విద్యుత్ ప్రాజెక్టు తొలి దశను ప్రారంభించారు. ఈ జల విద్యుత్ ప్రాజెక్టు 450 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మతమయింది. ఈ ప్రాజెక్టు జమ్ము- కాశ్మీర్ ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలు అధిగమించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|