యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
భజ్జీపై వీహెచ్‌పీ, భజ్‌రంగ్ దళ్ కేసులు
చండీగఢ్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 17:24 IST )
టీం ఇండియా ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ రావణుడిగా నటించడాన్ని తప్పుబడుతూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), భజ్‌రంగ్ దళ్‌‍లు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. అకల్ తక్త్ కూడా హర్భజన్ సింగ్ రావణుడిగా నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిక్కుల మనోభావాలను ఆయన గాయపరిచారని, ఇందుకు క్షమాపణ చెప్పాలని అకల్ తక్త్ డిమాండ్ చేసింది.

ఇదిలా ఉంటే తాజాగా వీహెచ్‌పీ, భజ్‌రంగ్ ధళ్ స్థానిక కోర్టులో భజ్జీపై పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌లపై చీఫ్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కంచన్ మహీ సోమవారం విచారణ జరపనున్నట్టు వెల్లడించారు. పంజాబ్ వీహెచ్‌పీ ప్రతినిధి విజయ్ సింగ్ భరద్వాజ్, ఇతర హిందూ సంస్థల ప్రతినిధులు భజ్జీ, ఆయనతో కలసి నటించిన మోనా సింగ్‌లపై కోర్టులో ఫిర్యాదు చేశారు.

భజ్జీ, మోనా సింగ్‌లు ఒక టీవీ కార్యక్రమం ద్వారా హిందు మతస్తుల మనోభావాలను కావాలని, దురుద్దేశ్యపూర్వకంగా గాయపరిచారని పిటిషన్‌దారులు ఆరోపించారు. ఇటీవల పలు టీవీ ఛానళ్లలో ప్రసారం అయిన "ఏక్ కిలాడీ ఏక్ హసీనా" కార్యక్రమంలో హర్భజన్ సింగ్ రావణుడిగా నటించారు. సిక్కు మత ఆచారాలను అగౌరవ పరచడంపై అకల్ తక్త్ ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనికి హర్భజన్ సింగ్‌ను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నుదుట తిలకం దిద్దడంతోపాటు, రావణుడి వేషం వేసి, ఒక మహిళతో బహిరంగంగా నృత్యం చేయడాన్ని అకల్ తక్త్ తప్పుబట్టింది. ఇది చాలా బాధాకరమని, ఇలాంటి ప్రవర్తనను సిక్కు సమాజం సహించబోదని అకల్ తక్క్ పేర్కొంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఒరిస్సాలో మళ్లీ హింస: 10 మందికి గాయాలు
ధులేలో మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేత
ప్రధాని జమ్ము- కాశ్మీర్ పర్యటన ప్రారంభం
అసోం హింసాకాండపై న్యాయ విచారణ
టాప్ 200 యూనివర్శిటీల్లో రెండు ఐఐటీలు
పౌర అణు ఒప్పందానికి సీసీపీఏ ఆమోదం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...