|
| ఒరిస్సాలో మళ్లీ హింస: 10 మందికి గాయాలు |
| భువనేశ్వర్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 17:09 IST ) | |
ఒరిస్సాలో మరోసారి హింసాత్మక వాతావరణం నెలకొంది. దుస్సెహ్రా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లాలో క్రైస్తవులు, హిందువుల మధ్య గురువారం రాత్రి ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పది మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
పోడియా గ్రామంలో ఇరువర్గాల మధ్య గురువారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 12 మంది హిందువుల, ఐదుగురు క్రైస్తవులు గాయపడ్డారని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఒరిస్సా రాష్ట్రంలో గత కొంతకాలంగా క్రైస్తవులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 23న రాష్ట్రంలోని కంధమాల్ జిల్లాలో వీహెచ్‌పీ నేత లక్ష్మానంద సరస్వతి హత్య అనంతరం ఈ హింసాకాండ ప్రారంభమైంది.
కంధమాల్ జిల్లాలో జరిగిన హింసాకాండకు 35 మంది బలైయ్యారు. వేలాది మంది ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గత ఏడు రోజులుగా కంధమాల్ జిల్లాలో ప్రశాంత వాతవరణం నెలకొంది. కంధమాల్‌లో చివరిసారి బుధవారంనాడు హింసాత్మక సంఘటనలు జరిగాయి. తాజాగా మల్కాన్‌గిరి జిల్లాలో హింసాకాండ రాజుకోవడంతో అధికారిక యంత్రాంగం పోడియా గ్రామంలో పోలీసులను మోహరించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|