|
| ధులేలో మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేత |
| నాసిక్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 14:01 IST ) | |
ఉత్తర మహారాష్ట్రలోని ధులే పట్టణంలో ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కొన్నిరోజుల క్రితం అల్లర్లు చెలరేగడంతో ఈ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అధికారిక యంత్రాంగం కర్ఫ్యూ విధించింది. వరుసగా ఐదు రోజులపాటు ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు శుక్రవారం కర్ఫ్యూని మూడు గంటలపాటు ఎత్తివేశారు.
ఉదయం 9 గంటల నుంచి మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేశామని ధులే పోలీసు అధికారులు తెలిపారు. కర్ఫ్యూ ఎత్తివేయడంతో ప్రజలు నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం ఇళ్లను వీడి బయటకు వస్తున్నారని పోలీసులు చెప్పారు. గురువారం కూడా పోలీసులు రెండు గంటలపాటు కర్ఫ్యూని ఎత్తివేశారు. కర్ఫ్యూ తాత్కిలికంగా ఎత్తివేసినప్పటికీ సీఆర్పీఎఫ్, ఎస్ఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్ సిబ్బంది ఇప్పటకీ పట్టణంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా విధుల్లో కొనసాగుతున్నారని పోలీసులు వెల్లడించారు.
ఆదివారం ధులే పట్టణంలో ఇరువర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ హింసాకాండలో మరో 170 మంది గాయపడ్డారు. హిందూ రక్షణ సమితి ఏర్పాటు చేసిన బేనర్‌ను చింపేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు రాజుకున్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు 250 మందిని అరెస్టు చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|