యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ప్రధాని జమ్ము- కాశ్మీర్ పర్యటన ప్రారంభం
శ్రీనగర్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 13:09 IST )
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రెండు రోజుల జమ్ము- కాశ్మీర్ రాష్ట్ర పర్యటనను శుక్రవారం ప్రారంభించారు. ఈ పర్యటనలో ప్రధాని రెండు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారిక యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. కాశ్మీర్ లోయలో రైలు సేవలను ప్రారంభించడంతోపాటు, ఒక జల విద్యుత్ కేంద్రాన్ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

ప్రధాని రాష్ట్రంలో పర్యటిస్తుండటంతో, కాశ్మీర్ లోయలోని వేర్పాటువాదులు శనివారం పౌర కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం జమ్ము ప్రాంతంలోని ఉధంపూర్‌లో ఉన్న భారత వైమానిక దళ స్థావరానికి చేరుకున్నారు. అనంతరం ఇక్కడి నుంచి ప్రధాని దోడా జిల్లాకు పయనమవతారు. అక్కడ చినాబ్ నదిపై నిర్మించిన 450 మెగావాట్ల భాగ్లీహార్ విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు.

ఈ కేంద్రం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమైంది. దీనిని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ విద్యుత్ కేంద్రం ప్రారంభమవుతుండటం ఒక రకంగా కల నిజమైనట్లని రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి సందీప్ నాయక్ తెలిపారు. ప్రధాని అనంతరం ఇక్కడ జరిగే ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ బహిరంగ సభకు ఆర్మీ, పారామిలటరీ సిబ్బంది, స్థానిక పోలీసులు భద్రత కల్పిస్తున్నారు.

చినాబ్ నదిపై రాష్ట్రంలో నిర్మితమైన మూడో జల విద్యుత్ ప్రాజెక్టు ఇది. ఈ ఏడాది ప్రధాని చినాబ్ నదిపై రెండో జల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఏఫ్రిల్ 26, 2008న ప్రధాని ఈ నదిపై కిష్త్‌వార్‌లో ఏర్పాటు చేసిన 360 మెగావాట్ల దుల్‌హస్తీ ప్రాజెక్టును కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రధాని తాజా పర్యటనలో శ్రీనగర్‌కు కూడా వెళతారు.

నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ, సీపీఎం తదితర రాజకీయ పార్టీల నేతలతో ప్రధాని ఈ సందర్భంగా చర్చలు జరుపుతారు. ప్రధాని కాశ్మీర్ లోయలో పర్యటిస్తున్న నేపథ్యంలో, వేర్పాటువాదుల సమన్వయ కమిటీ శనివారం పౌర కర్ఫ్యూకి పిలుపునివ్వడం గమనార్హం. ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీలతో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించదని వేర్పాటువాదులు వాదిస్తున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అసోం హింసాకాండపై న్యాయ విచారణ
టాప్ 200 యూనివర్శిటీల్లో రెండు ఐఐటీలు
పౌర అణు ఒప్పందానికి సీసీపీఏ ఆమోదం
భారత్‌కు ఇదొక ఓటమి: బీజేపీ, లెఫ్ట్
మూల్యం చెల్లించుకుంటారు: భజ్‌రంగ్ దళ్
భారత్ ఆందోళనలకు పరిష్కారం: సేన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...