|
| అసోం హింసాకాండపై న్యాయ విచారణ |
| గౌహతి (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008 ( 10:59 IST ) | |
రాష్ట్రంలోని దరాంగ్, ఉదల్‌గురి జిల్లాలో రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై అసోం ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ రెండు జిల్లాల్లో కొన్ని రోజులుపాటు బోడో జాతీయులు, అక్రమ బంగ్లాదేశీ వలసదారుల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో 52 మంది బలైయ్యారు.
అసోం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ గురువారం రెండు జిల్లాల్లోని బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. హింసాకాండను అదుపు చేయడంలో కొంత మంది పోలీసు అధికారులు విఫలం అయ్యారని ఆరోపణలు రావడంతో, ఆయన ఈ సందర్భంగా రెండు జాతుల మధ్య ఘర్షణలపై న్యాయ విచారణకు ఆదేశించారు.
ఈ విచారణలో హింసాకాండను అదుపు చేయడంలో పోలీసు అధికారుల వైఫల్యమున్నట్టు తేలితే, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. తరుణ్ గగోయ్ ఉదల్‌గురి జిల్లాలోని రౌతా ప్రాంతంలో, దరాంగ్ జిల్లాలోని బెసిమారి, భగత్‌పురా ప్రాంతాల్లో పర్యటించారు. సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుందని గగోయ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|