యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
టాప్ 200 యూనివర్శిటీల్లో రెండు ఐఐటీలు
లండన్ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 10:47 IST )
భారత్‌లోని రెండు ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు టాప్ 200 యూనివర్శిటీల్లో చోటు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలతో ప్రతి ఏటా ఈ జాబితాను తయారు చేస్తారు. ఈసారి జాబితాలో అమెరికా విద్యాసంస్థలే అధికం.

టైమ్స్ హైయర్ ఎడ్యూకేషన్- క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబయిలు వరుసగా 154, 174 స్థానాల్లో నిలిచాయి. జాబితాలో అమెరికాకు చెందిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో యాలే విశ్వవిద్యాలయం (అమెరికా), ఆ తరువాతి రెండు స్థానాల్లో వరుసగా కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలున్నాయి.

మొదటి 100 విశ్వవిద్యాలయాల్లో మూడోవంతు విద్యాసంస్థలు అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. టాప్ 50లో ఆసియా ఖండానికి చెందిన తొమ్మిది విద్యా సంస్థలు చోటుదక్కించుకున్నాయి. మూడు హాంకాంగ్ విద్యాసంస్థలు టాప్- 50లో ఉండగా, వాటిలో హాంకాంగ్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సియోల్ నేషనల్ యూనివర్శిటీలు ఈ ఏడాది జాబితాలో కొత్తగా స్థానం సంపాదించాయి.

చైనాకు చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు టాప్- 200లో ఉన్నాయి. వీటిలో పెకింగ్ విశ్వవిద్యాలయం 50వ స్థానంలో, సింగ్వా యూనివర్శిటీ 56వ స్థానంలో ఉన్నాయి. గత ఏడాది బ్రిటన్ విశ్వవిద్యాలయాలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఈ ఏడాది జాబితాలో కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాలు తమ స్థానాలను హార్వర్డ్, యాలేలకు కోల్పోయాయి.

ఈసారి టాప్- 100 విశ్వవిద్యాలయాల్లో 17 బ్రిటన్ విశ్వవిద్యాలయాలు మాత్రమే చోటు దక్కించుకున్నాయి. గత ఏడాది టాప్- 100లో 19 బ్రిటన్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. గత ఏడాది టాప్- 200లో మొత్తం 30 బ్రిటన్ విశ్వవిద్యాలయాలు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 29కి పడిపోయింది. ఈ 29 విశ్వవిద్యాలయాల్లో 22 ర్యాంకింగ్స్‌లోనూ దిగజారాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పౌర అణు ఒప్పందానికి సీసీపీఏ ఆమోదం
భారత్‌కు ఇదొక ఓటమి: బీజేపీ, లెఫ్ట్
మూల్యం చెల్లించుకుంటారు: భజ్‌రంగ్ దళ్
భారత్ ఆందోళనలకు పరిష్కారం: సేన్
ఒరిస్సా: కంధమాల్‌లో పరిస్థితి మెరుగు
సల్వాజుడానికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు: ఎన్‌హెచ్ఆర్‌సీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...