యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూ- కాశ్మీర్: కాంగ్రెస్ ప్రకటనపై మండిపడ్డ బీజేపీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 20 ఆగస్టు 2008   ( 09:39 IST )
అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు తిరిగి భూమి కేటాయించాలని ఆందోళన చేస్తున్న శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) కార్యకర్తలను హురియత్ నేతలతో కాంగ్రెస్ పోల్చడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీవ్రస్థాయిలో మండిపడింది. భిన్న ధృవవ్యక్తులను ఒకేగాటిన కట్టడం సరికాదని అభిప్రాయపడింది.

జమ్మూ ప్రాంత ప్రజలు భారత్ ఐక్యతకు మద్దతిస్తుంటే, హురియత్ స్వేచ్ఛ కోసం పోరాడుతుందని, పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ చెప్పినట్టు నడుచుకుంటుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అంతకుముందు శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితిని హురియత్‌కు మరో పార్శంగా కాంగ్రెస్ వర్ణించింది.

ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ ప్రతినిధి రవి శంకర్ ప్రసాద్ మంగళవారం విలేకరులతో చెప్పారు. ఇది పూర్తిగా బాధ్యతారాహిత్యంతో కూడిన ప్రకటన అని విమర్శించారు. దేనిని ప్రాతిపదికగా చేసుకొని ఎస్ఏఎస్ఎస్‌, హురియత్‌ను ఒకేగాటిన కట్టారో వెల్లడించాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.

హురియత్ బహిరంగంగానే వేర్పాటువాద ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. హురియత్ మద్దతుదారులు చాలామంది ఆగస్టు 15న పాకిస్థాన్ జెండాలు పట్టుకున్నారు. ఐఎస్ఐ చెప్పినట్టుగా నడుచుకోవడంతోపాటు, ఈ పాక్ సంస్థ చేతిలో వారు కీలుబొమ్మలని బీజేపీ నేత విమర్శించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమర్‌నాథ్ వివాదం: ఎస్ఏఎస్ఎస్‌కు చర్చల ఆహ్వానం
అహ్మదాబాద్ పేలుళ్లతో సిమి నేత నగోరికి సంబంధాలు
గ్రామీణ ఉపాధి పథకానికి ఐఐటీ, ఐఐఎంల సహకారం
ఆందోళన నిలిపివేత: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...