|
| అమర్‌నాథ్ వివాదం: ఎస్ఏఎస్ఎస్‌కు చర్చల ఆహ్వానం |
| శ్రీనగర్ (ఏజెన్సీ), బుధవారం, 20 ఆగస్టు 2008 ( 09:08 IST ) | |
శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్)ని అమర్‌నాథ్ భూవివాదంపై జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించి, అనంతరం ఉపసంహరించుకున్న వంద ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఏఎస్ఎస్ గత కొన్నివారాలుగా జమ్మూ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం మరోసారి చొరవచూపింది. చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఎస్ఏఎస్ఎస్‌ను మంగళవారం చర్చలకు ఆహ్వానించింది. శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి కన్వీనర్ లీలా కరణ్ శర్మకు చర్చల ఆహ్వానం పంపామని జమ్మూ- కాశ్మీర్ రాజ్‌భవన్ ప్రతినిధులు తెలిపారు.
అమర్‌నాథ్ భూవివాదానికి పరిష్కారం కనుగొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ సలహాదారు ఎస్ఎస్ బ్లొరియా ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నారు. ఎస్ఏఎస్ఎస్ చర్చల ఆహ్వానాన్ని స్వాగతిస్తే ఈ కమిటీ సభ్యులతోనే చర్చలు జరపనుంది. జమ్మూ- కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి జీడీ శర్మ, జమ్మూ విశ్వవిద్యాలయ ఉపకులపతి అమితాబ్ మత్తో, అమర్‌నాథ్ ఆలయ బోర్డు ముఖ్య కార్యనిర్వాహక అధికారి బీబీ వ్యాస్‌లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|