యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అహ్మదాబాద్ పేలుళ్లతో సిమి నేత నగోరికి సంబంధాలు
అహ్మదాబాద్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 18:57 IST )
అహ్మదాబాద్ బాంబు పేలుళ్లకు కీలక కుట్రదారుడిగా సిమి అగ్రనేత సఫ్దార్ నగోరి పేరు వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్ పేలుళ్లతోపాటు, జైపూర్, హైదరాబాద్ బాంబు పేలుళ్లలో కూడా నగోరి ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగోరి, అతని సన్నిహిత అనుచరులు కొందరు ఈ ఏడాది మార్చిలో ఇండోర్‌లో అరెస్టయ్యారు.

నగోరికి అహ్మదాబాద్ పేలుళ్లలో ప్రమేయం ఉందని గుజరాజ్ పోలీసులు మంగళవారం చెప్పారు. గత నెల 26న అహ్మదాబాద్ నగరాన్ని కంపింపజేసిన బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి ముఫ్తి అబు బషీర్‌ను పోలీసులు ఉత్తరప్రదేశ్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బషీర్ ఈ పేలుళ్లలో తన ప్రమేయం ఉందని అంగీకరించాడు.

కేరళలో గత ఏడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో గుజరాత్‌లోని హలోల్‌లో జరిగిన సిమి శిక్షణా శిబిరాల్లో నగోరి, అతని సోదరుడు కరీముద్దీన్ శిక్షకులుగా వ్యవహరించాలని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా అహ్మదాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు ప్రణాళికలు తయారు చేసిన కీలక కుట్రదారులు నగోరి, కరీముద్దీన్‌లేనని పోలీసులు పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గ్రామీణ ఉపాధి పథకానికి ఐఐటీ, ఐఐఎంల సహకారం
ఆందోళన నిలిపివేత: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...