యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఆందోళన నిలిపివేత: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం
శ్రీనగర్ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 14:11 IST )
తీవ్ర ఉద్రిక్తతతో అట్టుడుకిన కాశ్మీర్ లోయలో కొన్నిరోజుల తరువాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత ఎనిమిది రోజులపాటు వేర్పాటువాదుల ఆందోళన కారణంగా కాశ్మీర్ లోయలో అశాంతి నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్థిక దిగ్బంధాన్ని నిరసిస్తూ కాశ్మీర్ లోయలో వేర్పాటువాదులు ప్రస్తుతం వారి ఆందోళనను మూడు రోజులపాటు నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.

దీంతో మంగళవారం కాశ్మీర్ ప్రాంతంలో ప్రశాంతత నెలకొంది. ఈ ప్రాంతంలో పాఠశాలలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలను తిరిగి యథాతథంగా తెరిచారు. వేర్పాటువాదులు, సామాజిక సేవా సంస్థలు, వ్యాపార, ఉద్యోగ సంఘాలతో కూడిన సమన్వయ కమిటీ మంగళవారం నుంచి మూడు రోజులపాటు ఆందోళనను ఆపాలని నిర్ణయించింది.

దీంతో కాశ్మీర్ లోయలోని పలు జిల్లాలకు వెళ్లే మార్గాల్లో వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. విద్యార్థులు, కార్మికుల, ఇతర సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం సమన్వయ కమిటీ ఆందోళనను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 11న ఆర్థిక దిగ్బంధాన్ని నిరసిస్తూ వేర్పాటువాదులు కాశ్మీర్ లోయలో ఆందోళన ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వీరి ఆందోళన అనేకసార్లు హింసాత్మకంగా మారింది. పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసేందుకు కాశ్మీర్ లోయలోని వేర్వేరు ప్రదేశాల్లో కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికను వేర్పాటువాదులు శుక్రవారం ప్రకటించనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష
జమ్మూ- కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...