యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
జమ్మూ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 13:52 IST )
అమర్‌నాథ్ ఆలయ ట్రస్టు భూకేటాయింపుల ఉపసంహరణపై గత కొన్నివారాలుగా జమ్మూ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి మంగళవారం కాస్త మెరుగుపడింది. దీంతో అధికారిక యంత్రాంగం ఈరోజు జమ్మూ, సాంబా, ఉధంపూర్, కిష్తవార్ జిల్లాల్లో కొన్ని గంటలపాటు కర్ఫ్యూని సడలించారు.

జమ్మూ నగరంలో ఉదయం 0500 గంటల నుంచి పదిహేను గంటలపాటు, సాంబా జిల్లాలో తొమ్మిది గంటలపాటు కర్ఫ్యూని ఎత్తివేశారు. ఇదిలా ఉంటే ఉధంపూర్‌లో ఉదయం 0500 గంటల నుంచి 17 గంటలపాటు కర్ఫ్యూని ఎత్తివేయగా, కిష్తవార్ పట్టణంలో ఉదయం 0700 గంటల నుంచి మూడు గంటలపాటు కర్ఫ్యూ నీడని తొలగించారు.

కిష్తవార్‌లో భద్రతా పరిస్థితిని అధికారిక యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఈ నెల 12న కిష్తవార్‌లో రెండు సామాజికవర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరు వ్యక్తుల ప్రాణాలు బలిగొంది. ఈ ఘర్షణలో అనేక మంది గాయపడ్డారు.

మరోవైపు శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) ప్రారంభించిన మూడు రోజుల జైల్ భరో ఆందోళన మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. జైల్ భరో ఆందోళనలో భాగంగా సోమవారం వేలాది మంది నిరసనకారులు జమ్మూ ప్రాంతంలోని వివిధ పోలీసు స్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగి స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.

అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించిన వంద ఎకరాల భూమిని తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఏఎస్ఎస్ గత కొన్నివారాలుగా జమ్మూ ప్రాంతంలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఏఎస్ ఆందోళన జమ్మూ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని జిల్లాలు కొన్నిరోజులుగా కర్ఫ్యూ నీడలో ఉన్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష
జమ్మూ- కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు
అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...