|
| సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం |
| కోల్‌కత (ఏజెన్సీ), 19 ఆగస్టు 2008 ( 12:37 IST ) | |
సింగూరు వివాదం పరిష్కారం కోసం పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య సోమవారం ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఈ వివాదంపై చర్చలు జరిపేందుకు ఆహ్వానించారు.
సింగూరులో టాటా మోటార్స్ నానో కార్ల ప్లాంటు ఏర్పాటు కోసం జరిపిన భూసేకరణ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ ప్రాంతంలో ఏర్పాటయ్యే టాటా మోటార్స్ కార్ల ప్లాంటు రాష్ట్రానికి ఎంత అవసరమో వివరిస్తూ బుద్ధదేవ్ సోమవారం మమతా బెనర్జీకి లేఖ రాశారు. సింగూరు భూవివాదంపై మమతా బెనర్జీతో లేదా ఆమె పంపే ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|