|
| పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 11:45 IST ) | |
ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో పిల్లల మరణాలపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం సంస్థ డైరెక్టర్‌కు సూచించింది. ఇదిలా ఉంటే కొత్తగా వాడిన మందుల కారణంగా 49 మంది పిల్లలు మరణించలేదని ఎయిమ్స్ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో ఎయిమ్స్‌లో పిల్లల మరణాల అంశం కూడా చర్చకు వచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి నరేష్ దయాల్ విలేకరులతో చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అన్బుమణి రాందాస్ దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను కోరారు. విచారణ అనంతరం పిల్లల మరణాలపై పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపాలని సూచించారు.
ఇదిలా ఉంటే ఎయిమ్స్ యంత్రాంగం మాత్రం ఈ 49 మంది పిల్లలు తీవ్రంగా జబ్బునపడటంతోనే మృతి చెందారని, వారివి సాధారణ మరణాలేనని తెలిపింది. చికిత్స సందర్భంగా వాడిన మందుల ఫలితంగా వారు మరణించలేదని వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదిక కూడా సోమవారం సాయంత్రం తమ చేతికి వచ్చిందని ఎయిమ్స్ పిల్లల వైద్య విభాగ అధిపతి వీకే పాల్ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|