|
| కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008 ( 11:30 IST ) | |
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియపై జార్ఖాంఢ్ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నీలినీడలు కమ్ముకున్నాయి. జార్ఖాంఢ్‌లో నెలకొన్న రాజకీయ సమస్య పరిష్కరించబడే వరకు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉండే అవకాశంలేదని కాంగ్రెస్ సోమవారం వెల్లడించింది.
జార్ఖంఢ్ సంకీర్ణ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించడంతో, మధు కోడా నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలోకి జారుకున్న సంగతి తెలిసిందే. మధు కోడా స్థానంలో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు.
మరోవైపు జేఎంఎం అధినేత శిబు సోరెన్‌కు కాంగ్రెస్ విశ్వాసపరీక్ష సందర్భంగా కేంద్ర మంత్రి పదవి ఇవ్వజూపింది. విశ్వాసపరీక్షలో యూపీఏ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తే శిబు సోరెన్‌కు మంత్రి పదవి, పార్టీకి చెందిన మిగిలిన నలుగురు ఎంపీల్లో ఒకరికి సహాయ మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది.
అయితే ప్రస్తుతం జేఎంఎం అధినేత శిబుసోరెన్ జార్ఖంఢ్ ముఖ్యమంత్రి పదవిపై కన్నేశారు. ఇదిలా ఉంటే కీలకమైన మద్దతును ఇచ్చి ప్రభుత్వాన్ని విశ్వాసపరీక్షలో ఒడ్డునపడేసిన సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) మంత్రివర్గంలో చోటుకల్పిస్తారా అని అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ ప్రతినిధి స్పందిస్తూ, మంత్రివర్గంలో ఎస్పీ ప్రవేశం ఉండకపోవవచ్చని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|