|
| అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులు |
| జమ్ము/న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 16:26 IST ) | |
అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించిన అనంతరం ఉపసంహరించుకున్న 100 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) సోమవారం తన ఆందోళనను ఉధృతం చేసింది. వేలాది మంది నిరసనకారులు జమ్మూ ప్రాంతంలో స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు.
జమ్మూలోని వివిధ ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల ఎదుట వీరు నిరసనప్రదర్శనలకు దిగారు. అంతకుముందు ఎస్ఏఎస్ఎస్ సోమవారం జైల్ భరో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ ఆందోళన పిలుపుకు స్పందించిన వేలాది మంది నిరసనకారులు భం భం బోలే నినాదాలతో పోలీస్ స్టేషన్లకు తరలివెళ్లి సామూహిక అరెస్టులయ్యారు. జైల్ భరో ఆందోళన మూడు రోజులపాటు జరగనుంది.
పోలీసు స్టేషన్ల వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు వాహనాల్లో పాఠశాలలకు, స్టేడియాలకు తరలించారు. ఉధంపూర్ జిల్లాలో ఆందోళనకారులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీఛార్జి చేయడంతోపాటు, బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కథువా, సాంబా, ఆర్ఎస్ పురా జిల్లాల్లో కూడా ఆందోళనకారులు స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.
ఇదిలా ఉంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు. ఈ సరిహద్దు రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు సరైన దిశగా ఆలోచించేవారు కలిసి పనిచేయాలన్నారు. జమ్మూ- కాశ్మీర్ పరిస్థితులపై ప్రధాని మన్మోహన్ ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితిని నియంత్రించేందుకు రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలని కోరారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|