|
| జమ్మూ- కాశ్మీర్‌లో ఎస్ఏఎస్ఎస్ జైల్ భరో ఆందోళన |
| జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 15:33 IST ) | |
శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) సోమవారం జైల్ భరో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఆందోళన మూడు రోజులపాటు కొనసాగనుంది. ఇదిలా ఉంటే అధికారిక యంత్రాంగం కిష్తవార్, జమ్ము, ఉధంపూర్ జిల్లాలో ఒక రోజుపాటు కర్ఫ్యూ ఎత్తివేసింది. సాంబా జిల్లాల్లో తొమ్మిది గంటలపాటు కర్ఫ్యూని సడలించారు.
అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించి, ఉపసంహరించుకున్న భూమిని తిరిగి ఇచ్చివేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఏఎస్ఎస్ గత కొన్నివారాలుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. గత 51 రోజులుగా ఆందోళన చేస్తున్న ఎస్ఏఎస్ఎస్ సోమవారం జైల్ భరో ఆందోళనకు పిలుపునిచ్చింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|