|
| వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008 ( 13:10 IST ) | |
వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ వీసా గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల ప్రారంభంలో తస్లిమా నస్రీన్ భారత్ తిరిగివచ్చిన సంగతి తెలిసిందే. తస్లిమా వీసా గడువు సోమవారంతో తీరిపోనుంది. ఈ నేపథ్యంలో ఆమె వీసా గడువు పొడిగింపుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అధికారికవర్గాలు తెలిపాయి.
అయితే వీసా పొడిగింపుకు సంబంధించిన కాలపరిమితిపై ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు. దేశంలో ముస్లిం మత ఛాందసవాదులకు లక్ష్యంగా మారిన తస్లిమా నస్రీన్ (45) ఈ నెల ప్రారంభంలో స్వీడన్ నుంచి భారత్ తిరిగివచ్చారు. ఇక్కడకు తిరిగివచ్చిన అనంతరం అధికారులు ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఆమె భవిష్యత్ ప్రణాళికలపై కూడా ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|