యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 10:29 IST )
బల్తాల్‌లో అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు కేటాయించిన భూమిని తిరిగి ఇచ్చే వరకు తమ ఆందోళన ఆపబోమని శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) ఆదివారం తేల్చిచెప్పింది. జమ్మూ- కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఎస్ఏఎస్ఎస్ ఆరోపించింది.

కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లోయను సంతృప్తిపరిచే విధానాలను అనుసరిస్తుందని ఎస్ఏఎస్ఎస్ కన్వీనర్ లీలా కరణ్ శర్మ తెలిపారు. అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు భూకేటాయింపులు జరిగిన బల్తాల్‌ ప్రాంతానికి ర్యాలీ నిర్వహిస్తామని హెచ్చరించారు. అమర్‌నాథ్ ఆలయ ట్రస్టుకు ఇంతకుముందు జమ్మూ- కాశ్మీర్ ప్రభుత్వం భూమి కేటాయించిన సంగతి తెలిసిందే.

అయితే దీనిపై వివాదం చెలరేగడంతో ఈ భూకేటాయింపులను జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవడంపై శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి జమ్మూ ప్రాంతంలో గత కొన్నివారాలుగా ఆందోళన చేస్తోంది. ఈ ఆందోళన కారణంగా ఈ ప్రాంతంలో అశాంతి నెలకొన్న సంగతి కూడా విదితమే.

తమ ఆందోళన కొనసాగించడానికి అనేక మార్గాలు ఉన్నాయని ఎస్ఏఎస్ఎస్ పేర్కొంది. అయితే వాటిని బయటకు వెళ్లడించకుండా ఉండటం మంచిదని సమితి కన్వీనర్ లీలా కరణ్ శర్మ తెలిపారు. ఈ మార్గాల్లో ఆర్థిక దిగ్బంధం కూడా ఒకటని ధృవీకరించారు. అయితే ప్రస్తుతానికి దిగ్బంధాలేమీ లేవని, తాము దిగ్బంధానికి దిగితే ప్రపంచం మొత్తం తెలుస్తుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలే కారణమని చెప్పారు. దేశాన్ని తీవ్రవాదం నుంచి రక్షించాలని ప్రభుత్వం కోరుకుంటే, జమ్ము ప్రాంత ప్రజల ఆసక్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. దేశంలో తీవ్రవాదానికి కాశ్మీర్‌ను ప్రధాన ద్వారంగా వర్ణించారు. దేశాన్ని రక్షించాలంటే జమ్మూ ప్రాంతాన్ని పటిష్ట పరచాలన్నారు. జమ్మూ ప్రాంత ప్రజలకు దేశ ప్రజలందరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం
సీఎం రాజీనామా చేయపోతే మద్దతు ఉపసంహరణ: జేఎంఎం
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల వెనుక సిమీ హస్తం
హర్యానాలో యమునా నదికి వరదలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...