యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
రాంఛీ (ఏజెన్సీ), 18 ఆగస్టు 2008   ( 09:23 IST )
మధు కోడా నేతృత్వంలోని జార్ఖంఢ్ సంకీర్ణ ప్రభుత్వానికి ఆదివారం జేఎంఎం మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించింది. జార్ఖంఢ్ ముఖ్యమంత్రి మధు కోడా రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతో జేఎంఎం ఈ నిర్ణయం తీసుకుంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో జేఎంఎం అధినేత శిబు సోరెన్ జార్ఖంఢ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఆదివారం జరిగిన జేఎంఎం శాసనసభాపక్ష సమావేశంలో మధు కోడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయం తీసుకున్నారు. జేఎంఎం పార్లమెంటరీ బోర్డు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించనుంది. మధు కోడా ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని నిర్ణయించినట్టు జేఎంఎం ప్రధాన కార్యదర్శి హేమ్‌లాల్ ముర్ము తెలిపారు.

ఇదిలా ఉంటే పార్టీకి చెందిన మరో కీలక నేత దిలీప్ చటర్జీ తాము తీసుకున్న తాజా నిర్ణయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు శిబు సోరెన్ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం 81 మంది సభ్యులు ఉన్న జార్ఖంఢ్ అసెంబ్లీలో జేఎంఎంకు 17 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

జేఎంఎం మద్దతు ఉపసంహరించడంతో మధు కోడా ప్రభుత్వం మైనారిటీలోకి జారుకోనుంది. 17 మంది జేఎంఎం శాసనసభ్యులు, 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, స్పీకర్ ఓటు, ఏడుగురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు, స్వతంత్ర, వివిధ పార్టీల తిరుగుబాటు ఎమ్మెల్యేల మద్దతుతో జార్ఖంఢ్‌లో మధు కోడా ప్రభుత్వం నడుస్తోంది. ఇదిలా ఉంటే 2005లో శిబు సోరెన్ జార్ఖంఢ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు విఫలయత్నం చేశారు. శిబు సోరెన్ మెజారిటీ నిరూపించుకోలేకపోవడంతో వారం తరువాత మధు కోడా నేతృత్వంలో ప్రభుత్వం కొలువుతీరింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం
సీఎం రాజీనామా చేయపోతే మద్దతు ఉపసంహరణ: జేఎంఎం
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల వెనుక సిమీ హస్తం
హర్యానాలో యమునా నదికి వరదలు
లడఖ్‌లో కూలిన ఆర్మీ హెలీకాప్టర్: సిబ్బంది దుర్మరణం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...