|
| సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 17 ఆగస్టు 2008 ( 17:59 IST ) | |
భారత్-పాకిస్థాన్‌ల మధ్య రైళ్లలో ప్రయాణించేవారి కదలికలను సరిహద్దుల వద్ద వీడియో కెమేరాల ద్వారా నిఘా వేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇరు దేశాల మధ్య రైళ్ల రాకపోకలు అటారీ, మనుబావో రైల్వే స్టేషన్ల మీదగా సాగుతున్నాయి. ఈ రెండు మార్గాల్లో వారంలో ఎంపికచేసిన రోజుల్లో రైళ్లు నడుస్తున్నాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఉగ్రవాదుల దాడులు ఎక్కువైన సంగతి తెలిసిందే. వీడియో నిఘా ద్వారా ప్రయాణీకులు కదలికలను క్షుణ్ణంగా గమనించవచ్చునేది కేంద్రం భావన. వీడియో నిఘా కెమేరాల ఏర్పాటుకు సంబంధించి టెండర్లను కేంద్రం పిలిచింది. అటారీ, మనుబావో స్టేషన్ల నుంచి ప్రయాణీకుల రాకపోకల సమాచారాన్ని సమగ్రంగా సేకరించేందుకు నిఘా తోడ్పడుతుందని ఇంటిలిజెన్స్ బ్యూరో అభిప్రాయపడింది.
ఇరుదేశాల మధ్య సరిహద్దులను చెరిపేస్తూ ఢిల్లీ-లాహోర్ సంఝౌతా ఎక్స్‌ప్రెస్, జోధ్‌పూర్-కోక్రాపార్ మధ్య థార్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న... |
| |
|
|
|
|
|
|
|