|
| జమ్మూకు 10వేల భద్రతా దళాలు |
| జమ్మూ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 20:17 IST ) | |
అమర్‌నాథ్ వ్యవహారంపై చోటుచేసుకుంటున్న హింసను అదుపుచేయటానికి 10వేల భద్రతా దళాలను ఆర్మీ తరలించింది. జమ్మూలో ఉన్న సేనలకు వీరు సహాయపడతారు. జమ్మూ, శ్రీనగర్‌లతో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాలు చోటుచేసుకుని ఇప్పటికి పది రోజులు పూర్తవుతుంది.
అమర్‌నాథ్ వివాదంపై దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని ఆగస్టు 11వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరపాలని భారతీయ జనతా పార్టీ (భాజపా) నిర్ణయించింది. అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు గతంలో కేటాయించిన తిరిగి అప్పగించాలని భాజపా పట్టుబడుతోంది.
అమర్‌నాథ్ సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యుల కమిటీని జమ్మూ కాశ్మీర్ గవర్నర్ వోహ్రా నియమించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ వ్యవహారాన్ని చర్చల ద్వారానే పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|