యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
శ్రీనగర్‌కు ఆర్ఎస్ఎస్ ముస్లిం నేతల బృందం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008   ( 17:17 IST )
అమర్‌నాథ్ వ్యవహారాన్ని చక్కబెట్టటానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఒక ముస్లిం నేతల బృందాన్ని శ్రీనగర్‌కు పంపించింది. నిరసనకారుల ఆందోళనతో అట్టుడుకుతున్న జమ్మూ, శ్రీనగర్‌‌లోని వివిధ ప్రాంతాల్లో వీరు పర్యటించి శాంతి ప్రచారం చేస్తారు. రాష్ట్రవాది ముస్లిం మంచ్ పేరుతో 30మంది ముస్లిం నేతలు శ్రీనగర్‌కు గురువారం బయలుదేరారు.

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఆర్ఎస్ఎస్ నేత కేఎస్ సుదర్శన్ ముస్లిం నేతల బృందానికి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తుల సౌకర్యార్ధం వసతుల కోసం కేటాయించి వెనక్కుతీసుకున్న భూమిని తిరిగి ఇచ్చేయాలని సుదర్శన్ డిమాండ్ చేశారు.

ఆర్ఎస్ఎస్‌పై నిషేధాన్ని విధించాలని కోరుతున్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ ఆలోచన ఆయన నిజ స్వరూపాన్ని తెలుపుతోందని సుదర్శన్ ఆరోపించారు. భారతదేశంలో నివశిస్తున్న ముస్లింలు మాతృదేశాన్ని ప్రేమిస్తారని చెప్పారు. కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్థాన్‌ను మాతృభూమిగా భావించినట్లయితే వారిని అక్కడికి సగౌరంగా పంపిస్తామని రాష్ట్రవాది ముస్లిం మంచ్ కన్వీనర్ మహ్మద్ అఫ్జల్ వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమర్‌నాథ్ వివాదం: నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు
మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణె రాజీనామా
మహిళా బిల్లు ఇక మరుగున పడ్డట్లే: సుష్మా
చర్చలతోనే అమరనాథ్ భూవివాదానికి పరిష్కారం
సిమిపై నిషేధం కొనసాగింపు: హైకోర్టు తీర్పుపై స్టే
అమర్‌నాథ్ వ్యవహారం : బోర్డ్ సభ్యుల రాజీనామా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...