|
| అమర్‌నాథ్ వివాదం: నలుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు |
| జమ్మూ (ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 13:56 IST ) | |
అమర్‌నాథ్ భూవివాదం పరిష్కారానికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా నలుగురు సభ్యుల మండలిని ఏర్పాటుచేశారు. శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితితో చర్చలు జరిపేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేశామని వోహ్రా తెలిపారు. అమర్‌నాథ్ భూవివాదం కారణంగా గత కొన్నిరోజులుగా జమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో హింసాత్మక పరిస్థితులను అదుపు చేసేందుకు గవర్నర్ వోహ్రా ఏర్పాటుచేసిన నలుగురు సభ్యుల మండలి శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితితో చర్చలు జరుపనుంది. ఫ్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో అమర్‌నాథ్ వ్యవహారంపై బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో నేతలందురూ చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. అఖిలపక్షం తీసుకున్న నిర్ణయం మేరకు గవర్నర్ వోహ్రా ఈ నలుగురు సభ్యుల మండలిని ఏర్పాటుచేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|