|
| మహిళా బిల్లు ఇక మరుగున పడ్డట్లే: సుష్మా |
| భువనేశ్వర్, గురువారం, 7 ఆగస్టు 2008 ( 10:17 IST ) | |
సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలకు మధ్య కుదిరిన ఒప్పందం కుదిరింది. ఈ లోపాయికారి ఒప్పందం కారణంగా మహిళా రిజర్వేషన్ బిల్లు మరుగున పడే ప్రమాదముందని సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందక పోవచ్చని ఆమె అన్నారు. బిల్లు ఆమోదానికి సమాజ్‌వాదీ పార్టీ మోకాలొడ్డుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా ఎస్పీ, కాంగ్రెస్‌కు షరతులు విధించిందని అన్నారు. కాగా, బిల్లు పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ఆమోదం పొందితే, వచ్చే సంవత్సరంలోనైనా మహిళలకు లాభం చేకూరుతుందని ఆమె అన్నారు. కానీ యూపీఏ ప్రభుత్వం దీనిని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోతోందని చెప్పారు.
కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రకారం ప్రాధాన్యాన్ని బట్టి ఈ బిల్లును ఆమోదిస్తామని ప్రభత్వం ప్పటికప్పుడు కప్పదాటు ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు. అని చెప్పి నాలుగేళ్లయినా ఇంకా బిల్లు రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల హక్కులను కాలరాస్తోందని, కొత్త సమస్యలను సృష్టిస్త్తోందని ఆమె దుయ్యబట్టారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|