|
| చర్చలతోనే అమరనాథ్ భూవివాదానికి పరిష్కారం |
| న్యూఢిల్లీ(ఏజెన్సీ), గురువారం, 7 ఆగస్టు 2008 ( 10:06 IST ) | |
కాశ్మీర్ అల్లర్లకు ప్రధాన కారణమైన అమరనాథ్ యాత్ర మండలి భూవివాదం సద్దుమంచడానికి చర్చలే ఉత్తమ పరిష్కారమను అఖిలపక్షం అభిప్రాయపడింది. బుధవారం ప్రధాని మన్మోహన్ నివాసంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
దాదాపు నాలుగు గంటల నిడివి తీసుకున్న సమావేశంలో ఆయా పార్టీలు వారి వాదనలు, సూచనలు వినిపించాయి. బీజేపీ గవర్నర్‌ను మార్చాలని డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం ఇందుకు తిరస్కరించింది. సమస్య పరిష్కారానికి వీలుగా ఆయా వర్గాల వారితే చర్చలు జరపాలని అఖిలపక్ష నేతలు సూచించారు.
అఖిలపక్ష నేతలు స్వయంగా జమ్మూకు వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని తీర్మానించారు. దానికి కేంద్రమైన స్థలాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అమర్‌నాథ్ యాత్రకు వచ్చే వారికి రక్షణకల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. భూ వివాదంపై సంబంధిత వర్గాలతో చర్చలకు సిద్ధమని సర్కారు స్పష్టం చేసింది.
సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, బీజేపీ నేతలు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, జశ్వంత్‌సింగ్‌తో పాటు ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|