|
| కాశ్మీర్‌లో కర్ఫ్యూ ధిక్కరణ |
| జమ్మూ(ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008 ( 17:01 IST ) | |
అమరనాథ్ యాత్ర మండలికి కేటాయించిన భూమిని రద్దు చేయడంతో కాశ్మీర్ అట్టుడికిపోతోంది. ఎటు చూసినా అల్లర్లు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలోని చాలా చోట్ల కర్ఫ్యూ విధించారు. అయితే బుధవారం ఆందోళనకారులు ఉదంపూర్, కాశ్మీర్‌లోయ ప్రాంతంలో కర్ఫ్యూను సయితం ధిక్కరించారు.
ఒక రాత్రిలోనే అనేక చోట్ల ఆందోళనలు చోటు చేసుకున్నాయి. కత్వా ప్రాంతంలో జరిగిన అల్లర్లలో 12 మంది గాయపడ్డారు. ఉధంపూర్ ప్రాంతంలో ఆందోళన కారులు కర్ఫ్యూను ధిక్కరిస్తూ నిరసనలు తెలిపారు. ఆందోళనకారులు టార్చ్ లైట్లు చేత పట్టుకుని రెండు రాత్రులుగా తమ నిరసనలు తెలుపుతున్నారు.
పాలకులకు 400 మంది ఆందోళన వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు రెండువేల మంది ఆందోళనకారులు నదిని దాటి కర్ఫ్యూను ధిక్కరించారు. వారు పోలీసులను తిప్పలు పెట్టారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|