యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సామ్రాజ్యవాద కౌగిలికి భారత్: బుద్ధదేవ్
ఐక్య ప్రగతి శీల కూటమి ప్రభుత్వం అణు ఒప్పందంతో దేశాన్నికి అమెరికా సామ్రాజ్యవాద కౌగిలికి చేర్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్ర బుద్ధదేవ బట్టాచార్య ఆరోపించారు. ఈ చర్యలే వామపక్షాల మద్దతు ఉపసంహరణకు కారణమయ్యిందని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ముజఫర్ అహ్మద్ 120 వ జయంతి సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన ప్రసంగించారు.

భారతదేశాన్ని తన కక్ష్యలోకి లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. దీనిని వామపక్షాలు తీవ్రాస్థాయిలో వ్యతిరేకించాయన్నారు. దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే విధంగా అణు ఒప్పందం ఉందన్నారు. ప్రధాని దీనపై వామపక్షాలతో ఏమాత్రం చర్చించలేదన్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని కూడా అధిగమించారని ఆరోపించారు.

కొంతకాలం వేచి చూసిన వామపక్షాలు మద్దతు ఉప సంహరించుకున్నాయన్నారు. మద్దతు ఉపసంహరించుకున్న వామపక్షాలకు కూడా బీజేపీ, ఆర్‌ఎస్ఎస్‌ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రామసేతు, అమరనాథ్‌స్థల వివాదాలను ఇవి ముందుకు తీసుకు వస్తున్నాయన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కాంగ్రెస్‌తో చైనా కమ్యునిస్టుల దోస్తీ
సిమిపై నిషేధం ఎత్తేసిన ఢిల్లీ హైకోర్టు
అణుఒప్పందాన్ని ఎన్నో అవాంతరాలుః ప్రధాని
కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం
గృహ నిర్బందంలో గిలానీ
అదే ఉద్రిక్తత.... అవే అల్లర్లు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...