|
| సిమిపై నిషేధం ఎత్తేసిన ఢిల్లీ హైకోర్టు |
| న్యూఢిల్లీ, 6 ఆగస్టు 2008 ( 12:31 IST ) | |
స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమీ)పై నిషేధాన్ని మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఎత్తివేసింది. ఈ సంస్థపై ఇంకా నిషేధం విధించడంలో నిర్ధుష్టమైన ఆధారాలేవీ లేవని అభిప్రాయపడింది. భారతీయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 2006 నుంచి సిమీపై నిషేధం ఉన్నవిషయం తెలిసిందే.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 2001లో సీమీపై తొలిసారిగా నిషేధం విధించారు. పాకిస్థాన్ ఆధారిత లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయని నిఘా వర్గాలు నివేదికలందించాయి. చాపకింద నీరులా తీవ్రవాద సంస్థలకు సహాయ సహకారాలు అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
తరువాత రెండేళ్ళకొకమారు దీనిపై నిషేధనాన్ని పొడిస్తూ వస్తున్నారు. చివరి సారిగా 2006 ఫిబ్రవరి 8న ఈ నిషేధం విధించారు. ఏకసభ్య ట్రిబ్యునల్‌కు కేంద్ర మంత్రిత్వ హోంశాఖ ఇచ్చిన నివేదికలో సరియైన సమాచారం లేదని న్యాయమూర్తి గీతా మిట్టల్ అభిప్రాయ పడ్డారు. నిషేధం ఎత్తివేస్తూ 267 పేజీల జడ్జిమెంటును వినిపించారు. సుప్రీంకోర్టకు వేళ్ళనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|