|
| అణుఒప్పందానికి ఎన్నో అవాంతరాలుః ప్రధాని |
అందరు అనుకున్నంత సులువుగా అణుఒప్పందం అయిపోదని ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. అణు ఒప్పందం ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉందన్నారు. ఎన్నో రోజులుగా దేశంలో దుమారం రేపిన అణుఒప్పందంపై ప్రధాని మంగళవారం మనసు విప్పి మాట్లాడారు.
తన కుమార్తె ఉపిందర్ సింగ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరలతో మాట్లాడారు. అణుఒప్పందంలో తరువాతి అంకం ఎన్ఎస్‌జీ అని చెప్పారు. భద్రతా అంశాలకు సంబందించి అంతర్జాతీయ అణుఇందన సంస్థ ఒప్పందాలు పూర్తయిన తరువా ఎన్ ఎస్జీకు వెళ్ళుతున్నట్లు వివరించారు.
ఎన్‌ఎస్‌జీ అనుమతి పొందిన తరువాత అమెరికా కాంగ్రెస్‌లో గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉంది. న్యూఢిల్లీ మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఈ వాణిజ్యానికి యూఎస్ కాంగ్రెస్ తెరవనున్నుది. ఎన్‌ఎస్‌జీ నుంచి అణుఒప్పందానికి ఎటువంటి కొర్రీలు లేకుండా అనుమతి లభిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|