|
| గృహ నిర్బందంలో గిలానీ |
| శ్రీనగర్(ఏజెన్సీ), మంగళవారం, 5 ఆగస్టు 2008 ( 17:12 IST ) | |
హురియత్ కాన్ఫరెన్స్ నేత సయ్యద్ ఆలీ షా గిలానీని పోలీసులు మంగళవారం గృహనిర్భందంలో ఉంచారు. పోలీసు చర్యల్లో మృతి చెందిన యువకుడు ఆసీఫ్ మహరాజ్ ఇంటికి గిలానీ సోమవారం వెళ్ళి వచ్చారు. దీంతో పోలీసులు ఆయనను గృహనిర్భందంలో ఉంచారు.
ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూడడంలో భాగంగా పోలీసులు ఆయన ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. కాశ్మీర్‌లో జరుగుతున్న దాడులక నిరసనగా ఆయన ఒక్క రోజు బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయనను శనివారం గృహనిర్భందంలో ఉంచారు.
ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. మళ్ళీ ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇల్లు వదలడానికి లేదని చెప్పారు. ఇదిలా ఉండగా కాశ్మీర్‌లో ముస్లీంలపై జరుగుతున్న దాడులకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన తెలపాలని హురియత్ కన్ఫరెన్స్ అధికార ప్రతినిధి అయాజ్ అక్బర్ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|